గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి నాగరాజు
రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు నివారిస్తున్నామని మార్కాపురం డివిజన్ డిఎస్పి నాగరాజు అన్నారు. శుక్రవారం బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వాహనదారులకు డీఎస్పీ నాగరాజు అవగాహన కల్పించారు. పరిమితికి నుంచి ఆటోలలో కానీ వాహనాలలో కానీ ప్రయాణించరాదని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపలని వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెంట్ ధరించి ప్రయాణించాలన్నారు.