రాయదుర్గం: రైతులకు నాణ్యమైన ధాణా అందజేస్తాం : సొల్లాపురం లో జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంత పాలధార ద్వారా రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన ధాణా అందజేస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వల్లభా కంపెనీ ద్వారా తయారయ్యే పశు దాణాను మధ్యవర్తులు ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ విధానం వల్ల రైతులకు నాణ్యమైన దాణా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సరఫరాను పీఏసీఎస్ గోదాముల ద్వారా అమలు చేస్తూ, రెండు వారాలలో రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.