రాయదుర్గం: నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం : నియోజకవర్గ ఇన్చార్జ్ హీరోజీరావు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, నిధులు, సంక్షేమ పథకాల అమలు, సీసీ రోడ్లు తదితర వివరాలు ఆయా గ్రామాల ప్రజలకు పూర్తి సమాచారం అందుబాటులో ఉందని బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ హీరోజీరావు తెలిపారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కణేకల్లు మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో మండల అధ్యక్షులు తిప్పేస్వామి తదితర నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో బిజెపి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగినట్లు తెలిపారు. దేశాన్ని విశ్వగురువుగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిపారని కొనియాడారు.