రాప్తాడు: రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకే విద్యుత్ స్టేషన్లు ప్రారంభిస్తున్నాం ముత్తుకుంట్లలో ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం ముత్తుగుంట్ల గ్రామం వద్ద 3.30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆదివారం 11:45 నిమిషాల సమయంలో ఎంపీ పార్థసారథి తో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కనగానపల్లి మండలం ముత్తుగుంట్ల గ్రామం వద్ద తల్లిమడుగుల నెమలివరం ఇతర గ్రామాలకు విద్యుత్ సమస్య ఉండకూడదని 33 లెవెన్ కె విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నామని భవిష్యత్తులో విద్యుత్ సమస్య లేకుండా రైతులకు విద్యుత్తును అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.