గిద్దలూరు: కంభం పట్టణంలోని అర్బన్ కాలనీలో అకాల వర్షాల వల్ల కూలిన రేకుల ఇల్లు, విద్యుత్ స్తంభాలు, తప్పిన అపాయం
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని అర్బన్ కాలనీలో అకాల వర్షాలు ఆదివారం స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఓ వ్యక్తికి చెందిన ఇంటిపై రేకులు ఎగిరిపోయి 100 మీటర్లు దూరంలో పడ్డాయి. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆ సంఘటనలు జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేకపోవడం వల్ల ప్రజలకు ప్రాణాపాయం లేకుండా పోయింది.