మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయ సునీత మొక్కలను నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ వల్లే జీవన మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా ప్రజలు కృషి చేయాలన్నారు.