మార్కాపురం: జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్ వి కె పి కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... యోగా అనేది ప్రాచీన కాలం నుంచి వారసత్వంగా లభించిన సంపద అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అతి విలువైన కానుక అన్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున విజయవంతంగా కార్యక్రమం నిర్వహించామన్నారు.