యర్రగొండపాలెం: సుంకేసుల గ్రామ నిర్వాసితులకు స్మశానం కొరకు కేటాయించిన భూములను పరిశీలించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామ నిర్వాసితులకు స్మశానం కొరకు కేటాయించిన భూములను చిరంజీవి పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో భూమి ఎంత ఉందో విచారించారు. సంబంధిత నివేదికను ప్రాజెక్టు నిర్వాహకులు సంయుక్త కలెక్టర్ కి నివేదిక సమర్పిస్తున్నట్లు ఎమ్మార్వో తెలిపారు.