కొండపి: సింగరాయకొండ లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీమంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ వైసీపీ కార్యాలయం వద్ద వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి మహిళలకు 1500 నెలనెలా ఇచ్చే అంశాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. డీఎస్సీ పేరుతో ఉద్యోగులను మోసం చేశారని అన్నారు. మళ్లీ 2029 ఎన్నికలలో సీఎం గా జగనన్న గెలుస్తారని పేదలందరూ ఆనందంగా ఉంటారని అన్నారు.