మార్కాపురం: జిల్లా కేంద్రంలోని చిరు సప్లై ఛానల్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని చెరువు సప్లై ఛానల్ పై చిన్న బ్రిడ్జి వద్ద ప్లాస్టిక్ వ్యర్ధాలు ఖాళీ మద్యం సీసాలు పేరుకుపోతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించడంతో వ్యర్ధాల సమస్య కొంతకాలం నియంత్రణలో ఉంది. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి నెలకొనడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.