గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందినందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరికీ రూ.5 లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు 1068 మందికి రూ.8 కోట్లకు పైగా విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించామని ఎమ్మెల్యే అన్నారు.