మార్కాపురం: పొదిలి మండలం కంబాలపాడు వద్ద కారు సడన్ బ్రేక్ వేయడంతో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
మార్కాపురం జిల్లా పొదిలి మండలంలోని కంబాలపాడు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆపడంతో వెనుక ఉన్న కారు సడన్ బ్రేక్ వేశారు. దీంతో కార్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే కారులో ఉన్న వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారుల ప్రమాదంగా ఉండాలని పోలీసులు సూచించారు.