గిద్దలూరు: గిద్దలూరులోని టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బారు కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.