దర్శి: నూతన రైల్వే మార్గం ఏర్పడడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన కల నిజమైందని వెల్లడించిన దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మి
Darsi, Prakasam | Apr 29, 2026 ప్రకాశం జిల్లా దర్శి పొదిలి కనిగిరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు మార్గం కల నెరవేరింది. నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గంలో గుంటూరు నుంచి కనిగిరి వరకు ప్యాసింజర్ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కృషితో రైలు రాకపోకల కొనసాగుతాయి అన్నారు.