గిద్దలూరు: బేస్తవారిపేట మండలం చింతలపాలెం సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొని మోక్షగుండం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి
బేస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొని మోక్షగుండం గ్రామానికి చెందిన గురువారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మొదట తీవ్రంగా గాయపడ్డ గురువారెడ్డిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించగా అక్కడ మృతి చెందినట్లుగా ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూతురు వివాహానికి పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి గురువారెడ్డి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.