రాయదుర్గం: రాయదుర్గం తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సూర్యప్రతాప్
రాయదుర్గం తహసీల్దార్‌గా సూర్యప్రతాప్ బాధ్యతలు చేపట్టారు. పదోన్నతిపై ఆయనను రాయదుర్గం తహసీల్దార్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్‌రాయ్, ఆర్ఐ, వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్‌కు స్వాగతం పలికారు. అనంతరం సూర్యప్రతాప్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, చట్టపరిధిలో సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు.