గిద్దలూరు: గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాలలో ఒకేరోజు ఎండ, వానా కాలాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిక
ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం ప్రాంతాలలో అకస్మాత్తుగా వాతావరణ మార్పుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వరకు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరీరంపై వేడి గడ్డలతో పాటు చర్మ సంబంధిత సమస్య వస్తాయని వైద్యులు చెబుతున్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వైద్యులు తెలిపారు