ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రమేష్ బాధ్యతలు స్వీకరణ
ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో వెలసి ఉన్న అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రమేష్ శనివారం బాధ్యతల స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న తిరుమల రెడ్డి బదిలీ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ మాట్లాడారు. ఆలయ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, భక్తులు రమేష్ ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.