కొండపి: సింగరాయకొండలోని నవోదయ పాఠశాలలో అనుమానస్పద మృతి చెందిన తౌషిక్ మృతిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
సింగరాయకొండ లోని శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి తౌషిక్ ఫిబ్రవరి 14న అనుమానస్పద మృతి చెందాడు. గతంలో ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే తల్లిదండ్రులు ఇది ముమ్మాటికి హత్యానని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అధికారులు మరోమారు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సింగరాయకొండకు చేరుకొని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.