దర్శి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ దర్శి విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులు పిలుపు
Darsi, Prakasam | Jun 18, 2026 ప్రకాశం జిల్లా దర్శి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసులు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే పర్యావరణహితంగా ఉంటుందన్నారు. విద్యుత్తు లైన్లకు మొక్కలను దూరంగా నాటాలి అన్నారు. వివిధ కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక మొక్క నాటడం వల్ల గుర్తుండి పోతుందని అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు.