కనిగిరి: కనిగిరి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి పల్లకి సేవ, అమావాస్య కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు
మార్కాపురం జిల్లా కనిగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పల్లకి సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడ వీరభద్రస్వామి పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు దేవస్థానం కమిటీ వారు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కుందూరు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.