గిద్దలూరు: గిద్దలూరు మండలం మొడంపల్లి సమీపంలోని జగనన్న కాలనీలో నివసిస్తున్న హోంగార్డు ఇంటిలో చోరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం మోడంపల్లె గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా హోంగార్డు ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటిలోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి లక్షన్నర విలువచేసే బంగారంతో పాటు 12 తులాల వెండిని దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహించే కాశయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి వెళ్ళిన సమయంలో మన ఇంట్లో చోరీ జరిగిందని తెలిపాడు. స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం ని రంగంలోకి దించి పోలీసులు జరిగిన చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.