రాయదుర్గం: కణేకల్లు లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కణేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కణేకల్ శివారులోని అయోధ్య విద్యాలయం ఎదురుగా స్మశానం పక్కన నీటి కుంటలో 35-40 ఏళ్ల వ్యక్తి శవాన్ని పోలీసులు వెలికితీశారు. మృతుడు నీలం టీ షర్టు, సిమెంటు కలర్ షార్ట్ నిక్కర్ ధరించాడు. కుడి చేతిపై అమ్మ NTR పచ్చబొట్టు ఉంది. ఎత్తు 5.6 అడుగులు. ఆచూకీ తెలిసినవారు 9440901870కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగమధు కోరారు.