దర్శి: నేరాల నివారణ లక్ష్యంగా చెడు నడత గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపిన సిఐ రామారావు
Darsi, Prakasam | Jun 17, 2026 ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నివారణ లక్ష్యంగా చెడు నడత గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సిఐ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన వ్యక్తులను పిలిపించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించినట్లు తెలిపారు.