దర్శి: తాళ్లూరులో పాత శివాలయం కోనేరులో చెత్తాచెదారం నిండి నిరుపయోగంగా ఉందని తెలిపిన భక్తులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లో ప్రసిద్ధి చెందిన గుంటి గంగమ్మ సన్నిధిలో ఉన్న పాత శివాలయం కోనేరు చెత్తతో నిండిపోయింది. ఈ శివాలయం 50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిందగా స్థానికులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కనీసం గంట కొట్టే వారు కూడా లేక తాళాలు వేసి ఉంది. కోనేరులో కాయిన్స్ వేస్తే స్పష్టంగా కనపడేదని ఇప్పుడు మురికితో నిండిందన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఆలయానికి పూర్వ వైభవం తేవాలని కోరారు.