గిద్దలూరు: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఒంగోలులో పర్యటన, అమృత్ 2.0 పథకం ప్రారంభోత్సవ లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం ఒంగోలు పట్టడంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా నీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంటతో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వారు తెలిపారు.