యర్రగొండపాలెం: భర్త అత్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని పోలీసులను కోరిన భార్య
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన వివాహిత అత్త భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. వివాహమై 8 సంవత్సరాల అవుతున్న భర్తలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. భర్త అత్త పలుమార్లు కాళ్లతో తన్ని రూములో వేసి తాళాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నారు. దీంతో రెండుసార్లు అబార్షన్ కూడా అయిందన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు.