రాయదుర్గం: ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులుపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఫైర్
రాయదుర్గం నియోజకవర్గంలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని తాము ఆధారాలతో పిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆరోపించారు. బుధవారం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అండదండలతో మద్యం మాఫియా రెచ్చిపోతోందని విమర్శించారు. కమీషన్ లకోసం ఏఇంతటి దారుణానికి వడిగడతారా అంటూ ప్రశ్నించారు.