రాయదుర్గం: మైనర్లు వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు : రాయదుర్గం సిఐ జయనాయక్
మైనర్ లు వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం సిఐ జయనాయక్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బైక్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు రెండవ సారి పట్టుబడితే 10 వేలు, జైలుశిక్ష కూడా పడవచ్చని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.