దర్శి: దొనకొండ మండలంలో జనగణన పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎమ్మార్వో రమాదేవి
Darsi, Prakasam | Apr 10, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జనగణన పకడ్బందీగా నిర్వహించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మార్వో రమాదేవి తెలిపారు. మే ఒకటో తేదీ నుండి జనగణన ప్రారంభమవుతుందన్నారు. అందుకు సంబంధించిన సిబ్బందికి ఏప్రిల్ 25 వరకు పలు విడతలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆన్లైన్లో ద్వారా సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఐడి నెంబర్ చెప్పాలన్నారు.