మార్కాపురం: మార్కాపురం ఎమ్మార్వో పొదిలికి, పొదిలి ఎమ్మార్వో మార్కాపురం కి బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో పనిచేస్తున్న ఎమ్మార్వో కృష్ణారెడ్డి మార్కాపురం ఎమ్మార్వో గా బదిలీ అయ్యారు. మార్కాపురంలో ఎమ్మార్వో గా పని చేస్తున్న చిరంజీవి పొదిలి నూతన ఎమ్మార్వో గా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సంబంధిత అధికారులు నూతన బాధ్యతలను స్వీకరించాలని ఆదేశించారు. దీంతో ఇరువురు సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.