కొండపి: టంగుటూరు మండలంలో హెల్మెట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్ఐ నాగమల్లేశ్వరరావు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో టోల్ ప్లాజా వద్ద ఎస్సై నాగమల్లేశ్వరరావు వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో టోల్ ప్లాజా సిబ్బందితో పాటు వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి వాహనంపై ప్రయాణించాలన్నారు. మరణాల సంఖ్య తగ్గించాలన్న ఉద్దేశంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలను పాటిస్తూ హెల్మెట్ పై అవగాహన కల్పించామన్నారు.