మార్కాపురం: మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవరోజు ఎడ్ల పందాల పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల పందాల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు సీనియర్ విభాగం ఎడ్ల పందాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఇవాళ చివరి రోజు కావడంతో రైతులు స్థానిక ప్రజలు ఎడ్ల పందాల పోటీలను తిలకించేందుకు ఆసక్తి కనపరిచారు. పోటీలో పాల్గొన్న ఎడ్ల జతల యజమానులకు జ్ఞాపికతో సన్మానం చేశారు. స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు