ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షపాతం 44 మిల్లీమీటర్లుగా నమోదు కావడం జరిగిందని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ గురువారం పేర్కొన్నారు. బెలుగుప్ప మండలంలో అత్యధికంగా 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని కూడేరు 6.4 ఉరవకొండ 5.4 వజ్రకరూరు 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. బెలుగుప్పలో ఈదురు గాలులతో కూడిన వర్షపాతానికి రామసాగరం జీడిపల్లి అంకంపల్లి బెలుగుప్ప తదితర గ్రామాల్లో 100 ఎకరాల్లో పైగా మొక్కజొన్న, 50 ఎకరాలు అరటి పంటలు నేలవాలడంతో నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.