రాయదుర్గం: పట్టణంలోని కోతిగుట్ట వద్ద కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి, ప్రశ్నార్థకంగా వాటి మనుగడ
రాష్ట్ర జంతువు కృష్ణ జింకల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. శుక్రవారం రాయదుర్గంలో కోతిగుట్ట వద్ద కుక్కలు వెంటాడి తరమడంతో తీవ్ర గాయాలపాలై ఒక జింక తీవ్ర గాయాలపాలైంది. కుక్కల దాడి నుంచి తప్పించుకనేందుకు నర్సరీలోకి వచ్చింది. స్థానికులు కుక్కలను తరిమేసి జింకను కాపాడారు. ఫారెస్టు డిఆర్ఓ దామోదర రెడ్డి ఆధ్వర్యంలో జింకను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ నవీన్ వైద్య సేవలు అందించినప్పటికీ కొద్దిసేపటికి మరణించింది.