యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో జూన్ 9వ తేదీ జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన కలెక్టర్ విజయ సునీత
ఎర్రగొండపాలెం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఇందులో 10 కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎస్ ఎస్ సి ఇంటర్ డిగ్రీ డిప్లమా అర్హత కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 7013182284, 9912438757 సంప్రదించాలన్నారు.