రాయదుర్గం: పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతీఒక్కరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి : తహసీల్దార్ సూర్యప్రతాప్
పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తహసీల్దార్ సూర్యప్రతాప్ పిలుపునిచ్చారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం మాట్లాడుతూ, పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి నూటికి నూరు శాతం చుక్కల మందు అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి ఆరుఏ ఒక్క చిన్నారి మిస్ కాకుండా చూడాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.