రాయదుర్గం: పట్టణంలో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మెదటి పార్లమెంటు ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని రాయదుర్గంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్లతో కలసి సిఐటియు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుందరయ్య ఆశయాలను సాధిస్తామంటూ నినదించారు. సిఐటియు నాయకులు మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.