దర్శి: పడమర గంగవరం గ్రామంలో రోడ్డు ప్రమాదాలు నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై కోటయ్య
Darsi, Prakasam | Jun 15, 2026 ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కురిచేడు మండలం పడమర గంగవరం గ్రామంలో ఎస్సై జి కోటయ్య ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేర సంఘటనలు గురించి వివరించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు మహిళలపై జరుగుతున్న దాడులు సైబర్ నేరాలు పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు గ్రామాలలో సంచరిస్తున్నట్లయితే సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.