దర్శి: గుంటి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ తిరునాళ్ల రంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.