దర్శి: దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో మేలు జాతి లేగ దూడల ప్రదర్శన
ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో మేలు జాతి లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పశుసంవర్ధక శాఖ ఈవో డాక్టర్ మురళి ఏడి పురుషోత్తమ రాజు పాల్గొన్నారు. రాజంపల్లి లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం 28 మంది రైతులు 33 లేగ దూడలను ప్రదర్శించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో డాక్టర్ దేవా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.