గిద్దలూరు: మార్కాపురం డివిజన్ పరిధిలో ఈనెల 22వ తేదీన నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు
మార్కాపురం డివిజన్ లో ఈనెల 22వ తేదీ నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మార్కాపురం 16.8, పెద్దారవీడు 3.8, దోర్నాల6.2, త్రిపురాంతకం 5.6, గిద్దలూరు 9.8, రాచర్ల 17.2, కొమరోలు 9.2 వర్షపాతం నమోదయింది. డివిజన్ మొత్తం 68.6 వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు మూడు రోజుల పాటు ఇదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.