జడ్చర్ల: జడ్చర్ల మండలం బోయలకుంట లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
జడ్చర్ల మండలం బోయలకుంటకు చెందిన భాను రెండు రోజుల క్రితం చెరువులోకి చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం వాగులో నుంచి మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాలింపులో ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత పరామర్శించారు.