జడ్చర్ల: జడ్చర్ల మండలం బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్న పలు గ్రామాల ప్రజలు
భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరదతో జడ్చర్ల మండలం తంగేళ్లపల్లి, గుట్టకడిపల్లి వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గర్భిణీలు, పాఠశాల విద్యార్థులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ, పనులు ప్రారంభం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.