జడ్చర్ల: జడ్చర్లలో కళ్లల్లో కారం కొట్టి చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్ట్
జడ్చర్ల పట్టణంలో మద్యం దుకాణం మేనేజర్ రోహిత్ రెడ్డిపై దాడి చేసి రూ. 1.44 లక్షలు దోచుకెళ్లిన మూలింటి బాలాజీ, రవితేజ అనే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 7న నక్కలబండ తండా వద్ద జరిగిన ఈ ఘటనలో, కళ్లలో కారం చల్లి ఈ దోపిడీకి పాల్పడినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి నుంచి రూ. 72 వేలు నగదు, ఒక స్కూటీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ ఆదిరెడ్డి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.