జడ్చర్ల: జడ్చర్లలో కర్రీ పఫ్లో పాము.. ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
జడ్చర్లలోని ఓ బేకరీలో కొన్న కర్రీ పఫ్ పాము పిల్ల కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ ఇవాళ బేకరీలో తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేయడం, కాలం చెల్లిన క్రీమ్లు, పౌడరు వాడుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ లైసెన్స్ లేకపోవడంతో నోటీసు ఇచ్చారు. కర్రీ పఫ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్ వచ్చే వరకు బేకరీ మూసివేయాలని ఆదేశించారు