రాయదుర్గం: రాంపురం సమీపంలో హైవేపై ప్రమాదానికి గురైన సోమేశ్వర ప్రైవేటు ట్రావెల్ బస్సు, డ్రైవర్ మృతి
ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని డి.హిరేహాల్ సమీపంలో సోమేశ్వర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్తున్న బస్సు రాంపురం నుంచి 5 కి.మీ దూరంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల్లో రాంపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాంపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.