మార్కాపురం: కొనకనమిట్ల మండలంలో వ్యవసాయ కూలీలు వెళ్తున్న ఆటో బోల్తా పలువురికి తీవ్ర స్వల్ప గాయాలు
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం దొనకొండ క్రాస్ రోడ్డు సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. దీంతో 11 మందికి స్వల్ప తీవ్ర గాయాలయ్యాయి. పెద్దరికట్ల నుండి కొత్తపల్లికి వ్యవసాయ కూలీలు వెళ్తుండగా ఆటోకు పందులు అడ్డు రావడంతో అదుపుతప్పి ఒకసారి బోల్తా పడింది. ఆటోలో సుమారు 15 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వారిలో గాయపడిన వారిని 108 వాహనం ద్వారా పొదిలి వైద్యశాలకు తరలించారు.