దర్శి: సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరిన పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి
ప్రకాశం జిల్లా దొనకొండ పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలని తెలిపారు. మే 31వ తేదీ వరకు ఐదు శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించే అవకాశం ఉంది అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.