విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోసం రూ. 3 లక్షల కోట్ల రహదారి ప్రాజెక్టులు: నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
ఏపీ అభివృద్ధి కోసం 3 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది. విశాఖపట్నంలో సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు కీలక రహదారి ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కీలక ఎక్స్‌ప్రెస్‌వేల వివరాలు ఇందులో ఉన్నాయి.